anupriya: ఈవ్ టీజింగ్ కు గురైన కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్!

  • నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటన
  • అనుప్రియపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన దుండగులు
  • భద్రతా సిబ్బందితో అనుచిత ప్రవర్తన

ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె... తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఔరాయ్, మీర్జామురాద్ ల మధ్య కారు ప్రయాణిస్తుండగా ముగ్గురు దుండగులు తనను వేధించారని పోలీసులకు అనుప్రియ ఫిర్యాదు చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనంలో వారు ప్రయాణించారని... తన వాహన శ్రేణిని దాటేందుకు ప్రయత్నించారని తెలిపారు. తన భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించినప్పటికీ, ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, భద్రతా సిబ్బందితో అనుచితంగా వ్యవహరించారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.

anupriya
minister
eve teasing
Uttar Pradesh
  • Loading...

More Telugu News