gopichand: షూటింగు పార్టు పూర్తిచేసుకున్న 'పంతం' .. రిలీజ్ డేట్ ఖరారు

- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
గోపీచంద్ కథానాయకుడిగా చక్రి దర్శకత్వంలో 'పంతం' మూవీ రూపొందింది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరునాటికి ఈ సినిమా మిగతా పనులను పూర్తి చేసుకుని వచ్చేనెల 5వ తేదీన విడుదల కానుంది.
