Rajinikanth: నాన్న ఇక సినిమాలు మానేస్తేనే బెటర్!: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య

  • నాన్న కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి
  • ఇప్పటికిప్పుడే సినిమాలకు దూరం కావాలని చెప్పడం లేదు
  • క్రమంగా సినిమాలను తగ్గించుకోవాలి

తన తండ్రి రజనీకాంత్ గురించి ఆయన కుమార్తె ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్న ఇకపై సినిమాలు మానేసి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన నటన ద్వారా ఎంతో మంది సినీ అభిమానులను అలరిస్తున్న నాన్న... పూర్తిగా ఆ రంగంపైనే దృష్టిని కేంద్రీకరించడం తగదని చెప్పారు.

ఇప్పటికిప్పుడే సినిమాలను పూర్తిగా వదిలేయాలని తాను చెప్పడం లేదని... క్రమంగా సినిమాలను తగ్గించుకుంటూ, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అన్నారు. సంతోషమొస్తే ఎక్కువగా పొంగిపోకూడదని, దు:ఖం వస్తే కుంగిపోకూడదని నాన్న చెప్పే మాటలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. సుఖదు:ఖాలను సమానంగా భరించాలనేదే తన తండ్రి సిద్ధాంతమని చెప్పారు. 

Rajinikanth
aishwarya
daughter
films
  • Loading...

More Telugu News