evm: ఈవీఎంలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది: యనమల ఆందోళన

  • ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది
  • ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్రం నియంత్రణలో పెట్టుకుంది
  • ఈవీఎంల పనితీరుపై పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేయాలి

ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేయాలని అన్నారు. ఎన్నికల సంఘంతో పాటు దేశంలోని అన్ని వ్యవస్థలనూ కేంద్ర సర్కారు తన నియంత్రణలో పెట్టుకుందని ఆరోపించారు. ఈవీఎంలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు.

evm
Yanamala
Andhra Pradesh
  • Loading...

More Telugu News