Reliance: ఐడియాను వెనక్కి నెట్టేసిన జియో... 19 నెలల్లోనే సంచలనం!

  • మార్చి నాటికి ఆదాయ వాటా 20 శాతానికి చేరిక
  • ఐడియా వాటా 16.5 శాతమే
  • 32 శాతం వాటాతో ఎయిర్ టెల్ నంబర్-1

వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన 19 నెలల్లోనే రిలయన్స్ జియో మరో రికార్డు నమోదు చేసింది. ఆదాయ వాటాలో మూడో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. ఐడియాను నాలుగో స్థానానికి నెట్టేసింది. జియో రెండో స్థానంలో ఉన్న వొడాఫోన్ కు అతి సమీపానికి వచ్చేసింది. మొదటి స్థానంలో ఎయిర్ టెల్ ఉంది. ఈ మేరకు ట్రాయ్ గణాంకాలను ఈ రోజు విడుదల చేసింది.

2018 మార్చి నాటికి జియో ఆదాయ వాటా 20 శాతం సమీపానికి వచ్చేసింది. ఐడియా ఆదాయ వాటా 16.5 శాతంగానే ఉంది. వొడాఫోన్ 21 శాతం వాటాను కలిగి ఉంది. భారతీ ఎయిర్ టెల్ 32 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. మరో నెలలోపే ఐడియా, వొడాఫోన్ సంస్థల విలీనం పూర్తి కానుంది. దీంతో ఈ రెండు సంస్థల ఆదాయం 16.5 శాతానికి 21 శాతం కలుపుకుంటే 37.5 శాతంతో నంబర్ 1 స్థానానికి చేరుకోగలదు.

  • Loading...

More Telugu News