Chandrababu: చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి.. మోత్కుపల్లిని కలిస్తే తప్పేముంది?: విజయసాయిరెడ్డి

  • గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట
  • పోలవరంలో ఒకే రోజు 13వేల క్యూ.మీ. పనులు చేశారా?
  • మోత్కుపల్లిని కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అంటూ ఘాటు విమర్శలు చేశారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్ మీటర్ల పనులను చేశామని చంద్రబాబు అన్నారని... ఇదే విషయాన్ని తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలతో తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవాలని అనుకోలేదని... కానీ, చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పకుండా కలుస్తానని విజయసాయి చెప్పారు. ఒక దళిత నేతను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మోత్కుపల్లిని తాను కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకని అన్నారు.

Chandrababu
motkupalli
Vijay Sai Reddy
polavaram
  • Loading...

More Telugu News