jabardast: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ యాంకర్ చలాకి చంటి!

  • తృటిలో తప్పిన పెను ప్రమాదం
  • రెండు కార్లు ఢీకొని ధ్వంసం
  • కేసు నమోదు చేసిన పోలీసులు

టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి చంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా 44వ జాతీయరహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చంటి సురక్షితంగా బయటపడ్డప్పటికీ రెండు కార్లు మాత్రం ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News