India: వరుసగా 14వ రోజూ తగ్గిన 'పెట్రో' ధరలు... తాజా ధరల వివరాలు!

  • 15 పైసలు తగ్గిన పెట్రోలు ధర
  • 10 పైసలు తగ్గిన డీజెల్ ధర
  • వెల్లడించిన ఐఓసీ

రెండు వారాల క్రితం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటంతో నెమ్మదిగా దిగొస్తున్నాయి. నేడు వరుసగా 14వ రోజూ పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 15 పైసలు, డీజెల్ ధరను 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.  

తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 80.96గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.85, కోల్ కతాలో రూ. 70.40, ముంబైలో రూ. 72.24, చెన్నైలో రూ. 71.62గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 73.75గా ఉంది.

India
Crude Oil
Petrol
Diesel
IOCL
  • Loading...

More Telugu News