kumaraswamy: నేను సీఎం అవడం మా నాన్నకు ఇష్టం లేదు: కుమారస్వామి

  • నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం పోస్టు వద్దన్నారు
  • కాంగ్రెస్ మాత్రం ఆ పోస్టును నాకే అప్పగించింది
  • విధాన సభలో ఆ మధ్యవర్తిని చూస్తే భయమేస్తోంది

తాను ముఖ్యమంత్రిని కావడం తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పోస్టును మీరే ఉంచుకోండని తన తండ్రి కాంగ్రెస్ నేతలతో చెప్పారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం తనకే ఓటేశారని అన్నారు.

‘‘నాకు రెండుసార్లు గుండె ఆపరేషన్ అయిందని మా నాన్న కాంగ్రెస్ నేతలతో చెప్పారు. ఆరోగ్యపరంగా నాకు సమస్య వుంది కాబట్టి, సీఎం పోస్టును మీరే ఉంచుకోండి అని కాంగ్రెస్ నేతలను నాన్న కోరారు. అయితే, వారు మాత్రం నన్ను సీఎంను చేశారు’’ అని కుమారస్వామి వివరించారు.

‘‘నేను ముందుండి ప్రభుత్వాన్ని నడపగలనా? అని ఒక్కోసారి భయమేస్తోంది. ఎందుకంటే విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా? అని అనిపిస్తుంటుంది. నా ఆందోళనను నా తండ్రికి కూడా చెప్పా’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

kumaraswamy
Karnataka
HD Devegowda
CM
  • Loading...

More Telugu News