atal bihari vajpayee: దాదాపు గంట సేపు ఆసుపత్రిలోనే ఉన్న మోదీ

  • ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయి
  • ఆసుపత్రికి వెళ్లిన మోదీ, అద్వానీ, రాహుల్, అమిత్ షా
  • వాజ్ పేయి కుటుంబసభ్యులతో మాట్లాడిన మోదీ

మాజీ ప్రధాని వాజ్ పేయి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ప్రధాని మోదీ ఎయిమ్స్ కు వెళ్లారు. ఈ సందర్భంగా వాజ్ పేయి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 50 నిమిషాల సేపు మోదీ ఎయిమ్స్ లోనే ఉన్నారు.

మరోవైపు, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో చర్చించి, వివరాలను తెలుసుకున్నారు.

atal bihari vajpayee
modi
advani
amit shah
  • Loading...

More Telugu News