Atal Bihari Vajpayee: వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసిన ఎయిమ్స్

  • స్థిరంగా ఉన్న వాజ్‌పేయి ఆరోగ్యం
  • రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో పర్యవేక్షణ
  • ఎయిమ్స్ చైర్ పర్సన్ పేరిట విడుదలైన స్టేట్ మెంట్

భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి రెగ్యులర్ వైద్య పరీక్షల్లో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఈ ఉదయం అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ యావత్ దేశం ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు. 

"వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ఓ వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. అవసరమైన అన్ని టెస్టులు నిర్వహించారు" అని స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఛైర్ పర్సన్ పేరిట ఈ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News