Telangana: తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే వీఆర్‌ఏలకు జీతాలు ఎక్కువ పెంచాం!: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కేఈ కృష్ణమూర్తి

  • జీవో నెంబరు 303 కింద వేతనాల పెంపు
  • ఈనెల 2 నుంచే అమలు
  • ఇప్పుడు వారి గౌరవ వేతనం రూ.10,500
  • అంతకు ముందు రూ.6,000

జీవో నెంబరు 303 కింద తాము వీఆర్‌ఏలకు వేతనాలు పెంచామని, ఈనెల 2 నుంచే అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే వీఆర్‌ఏలకు జీతాలు ఎక్కువ పెంచామని తెలిపారు. ఇప్పుడు వారి గౌరవ వేతనం రూ.10,500గా ఉందని, అంతకు ముందు రూ.6,000గా ఉండేదని అన్నారు. అలాగే, టీఏ రూ.20 నుంచి రూ.100కి, డీఏ రూ.100 నుంచి రూ.300కి పెంచామని తెలిపారు. ఈ జీవోతో 26 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 

Telangana
Andhra Pradesh
ke krishna murthy
  • Loading...

More Telugu News