cbi: నీరవ్‌ మోదీ ఎక్కడున్నాడో తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం: సీబీఐ

  • కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన నీరవ్‌ మోదీ
  • ఆయన ఎక్కడున్నారో తెలియదన్న సీబీఐ
  • రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు సూచన

నీరవ్‌ మోదీ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి ధ్రువీకరణ లేదని సీబీఐ అధికారులు ఈరోజు తేల్చి చెప్పారు. ఆయన ఎక్కడున్నాడన్న విషయం తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన విజయ్‌ మాల్యాలాగే లండన్‌లో తలదాచుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఇలా స్పందించి వివరణ ఇచ్చింది.

కాగా, నీరవ్‌ మోదీ, మేహుల్‌ చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో నీరవ్‌ మోదీ, అతడి మామ మేహుల్‌ చోక్సీలు కలిసి మొత్తం రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడ్డారని అధికారులు ఇప్పటికే తేల్చారు.

  • Loading...

More Telugu News