vijay devarakonda: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు నేను నామినేట్‌ అయ్యానట.. నాతో వస్తారా?: విజయ్‌ దేవరకొండ ఆఫర్

  • http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
  • పేరు, వివరాలను ఇవ్వండి
  • వారిలో ఒకరిని ఫిలింఫేర్‌కు తీసుకెళతా

'ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి జాబితాలో నేను నామినేట్‌ అయ్యానట' అని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అన్నాడు. తాజాగా, ఆయన సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు. మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌, నందమూరి బాలకృష్ణ లాంటి వారంతా గొప్ప నటులని, చాలా కష్టపడి పనిచేస్తారని ఆయన అన్నాడు. చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు. ఇక వారి తదుపరి ఇప్పుడు తారక్‌, ప్రభాస్‌ వాళ్ల జనరేషన్‌ ఉందని, వాళ్ల తరువాతే తానని, ఓ రకంగా చూస్తే బచ్చాగాడినని వ్యాఖ్యానించాడు.

తాను అటువంటి హీరోలతో పాటు ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్‌కు నామినేట్‌ కావడం గొప్ప విషయమని, తనకు అవార్డు గెలిచినట్లే ఉందని అన్నాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తాను ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్తున్నానని, కాబట్టి తనతో పాటు అభిమానుల్లో ఒకరిని తీసుకువెళతానని అన్నాడు. తనను ఎవరైతే బాగా ఇష్టపడతారో వారు http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలని కోరాడు. అక్కడ పేరు, వివరాలను ఇస్తే, వారిలో ఒకరిని తాను ఫిలింఫేర్‌కు తీసుకెళతానని చెప్పాడు. కాగా, పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, మహానటి సినిమాలతో విజయ్‌ దేవరకొండ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

vijay devarakonda
Twitter
offer
  • Loading...

More Telugu News