rajanikanth: నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టేసిన 'కాలా'

  • మాఫియా డాన్ గా రజనీకాంత్ 
  • ప్రతినాయకుడిగా నానా పటేకర్
  • ఆస్ట్రేలియాలోను తగ్గని వసూళ్ల జోరు        

మాఫియా డాన్ గా 'కాలా'లో రజనీకాంత్ మరో మారు తన విశ్వరూపం చూపించారు. రజనీ లుక్స్ .. ఆయన డైలాగ్స్ .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. వసూళ్ల  విషయంలో పాత రికార్డులను బీట్ చేస్తూ వెళుతోంది.

రజనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు .. అందువలన విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో నిన్నటి వరకూ ఈ సినిమా 2.4 కోట్లను రాబట్టినట్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆస్ట్రేలియాలో తొలివారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా 'కాలా' నిలవగా .. మొదటి స్థానంలో 'పద్మావత్' వుంది. రజనీకాంత్ .. నానా పటేకర్ పాత్రలు సమతూకంగా నిలిచి కథను నడిపించడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.         

rajanikanth
nana patekar
  • Loading...

More Telugu News