vijayasai reddy: మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి.. మీడియాను చూసి వాహనం దిగకుండానే వెళ్లిపోయిన వైనం!

  • హైదరాబాదులో మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన విజయసాయి
  • చంద్రబాబును విమర్శించి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి
  • టీఆర్ఎస్ లో చేరే అవకాశం

టీడీపీపైనా, పార్టీ అధినేత చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయని మోత్కుపల్లి మౌనంగానే ఉన్నారు. అయితే, మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పొగుడుతున్నారు. దీంతో, టీఆర్ఎస్ లో ఆయన చేరుతారని వార్తలు వచ్చాయి.

 ఈ నేపథ్యంలో మోత్కుపల్లిని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యత్నించారు. హైదరాబాదులోని మోత్కుపల్లి నివాసానికి ఆయన ఈ రోజు వెళ్లారు. అయితే, అప్పటికే అక్కడ మీడియా ఉండటంతో, వాహనం దిగకుండానే ఆయన అక్కడి నుంచి అటే వెళ్లిపోయారు. 

vijayasai reddy
motkupalli
Chandrababu
  • Loading...

More Telugu News