vishal: త్వరలోనే 'అభిమన్యుడు 2'లో నటించబోతున్నాను: హీరో విశాల్ ప్రకటన

  • తాజాగా 'అభిమన్యుడు' సినిమాతో హిట్‌ కొట్టిన విశాల్‌
  • 'పందెం కోడి' సీక్వెల్లోనూ నటిస్తోన్న హీరో
  • తాజాగా మరో ప్రకటన

తాజాగా 'అభిమన్యుడు' సినిమాతో హిట్‌ కొట్టిన హీరో విశాల్‌.. 'పందెం కోడి' సీక్వెల్ ను తెలుగులోనూ దసరాకి విడుదల చేయడానికి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే కాకుండా 'అభిమన్యుడు-2'లో కూడా తాను నటించనున్నట్లు విశాల్‌ ప్రకటించాడు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'అభిమన్యుడు'ని ఇంతగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుంచి తననెంతో ఆదరిస్తున్నారని అన్నాడు. ఈ విజయం తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని, త్వరలోనే 'అభిమన్యుడు-2' మొదలుపెట్టబోతున్నామని చెప్పాడు.    

  • Loading...

More Telugu News