kalyan ram: విడుదలకి దగ్గరగా 'నా నువ్వే' .. ప్రమోషన్లతో బిజీగా కల్యాణ్ రామ్

  • కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే' 
  • కథానాయికగా తమన్నా 
  • ఈ నెల 14వ తేదీన భారీ రిలీజ్

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా కల్యాణ్ రామ్ వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, పెద్దగా గ్యాప్ లేకుండా 'నా నువ్వే' సినిమాతో రెడీ అవుతున్నాడు. కల్యాణ్ రామ్ .. తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకి జయేంద్ర దర్శకత్వం వహించాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేశారు. ముందుగా టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చే పనులతో కల్యాణ్ రామ్ బిజీగా వున్నాడు. విజయ్ .. కిరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.  జయేంద్ర కూడా దర్శకుడిగా ఈ సినిమా తనని నిలబెడుతుందనే ఆశతో వున్నాడు.  

kalyan ram
tamannah
  • Loading...

More Telugu News