akhilesh yadav: అవసరమైతే బీఎస్పీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు రెడీ!: అఖిలేశ్

  • బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
  • ఇందుకోసం రాజీకైనా సిద్ధమే
  • యోగి పాలనలో అన్ని చోట్లా బీజేపీ ఓడిపోతుంది

బీఎస్పీతో 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగుతుందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పారు. యూపీలోని మెయిన్ పురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీని అఖాతంలో ఉంచేందుకు అవసరమైతే బీఎస్పీకి కొన్ని ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమేనని ప్రకటించారు. బీజేపీ ఓటమి ఖాయమన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించేయడానికి తాము రాజీకైనా సిద్ధమేనని ప్రకటించారు.

‘‘మా ఉద్దేశ్యం బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో గెలవడమే. బీఎస్పీతో పొత్తుకు రెడీ’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య భాగస్వామ్యం ఇటీవలి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోతుందన్న అఖిలేశ్, గత నాలుగు ఉప ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థుల విజయాన్ని ఉదహరించారు. 

akhilesh yadav
sp
bsp
  • Loading...

More Telugu News