mohammed shami: ఒక పెళ్లితోనే నరకం అనుభవించా.. రెండో పెళ్లా?: మొహమ్మద్ షమీ

  • రంజాన్ తర్వాత మరో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఆరోపించిన హసీన్
  • రెండో పెళ్లి చేసుకోవడానికి తాను పిచ్చోడిని కాదన్న షమీ
  • కుటుంబ సమస్యలతో ఆటతీరు పడిపోయిందంటూ ఆవేదన

టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్ ల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జహాన్ మాట్లాడుతూ, రంజాన్ మాసం తర్వాత షమీ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పింది. పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత ఈ వివాహం జరగనుందని తెలిపింది.

ఈ ఆరోపణపై షమీ స్పందిస్తూ... ఇప్పటికే ఒక పెళ్లితో నరకం అనుభవించానని... ఇలాంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవడానికి తానేమైనా పిచ్చోడినా అని ప్రశ్నించాడు. ఒకవేళ మరో పెళ్లి చేసుకుంటే... హసీన్ జహాన్ ను ఆహ్వానిస్తానని ఎద్దేవా చేశాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆటలో తన స్థాయి మేరకు రాణించలేకపోతున్నానని... ఇంగ్లండ్ పర్యటనలో అయినా తన పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నట్టు తెలిపాడు. 

mohammed shami
hasin jahaan
team india
second
marriage
  • Loading...

More Telugu News