janhvi kapoor: టీనేజ్ లవ్ స్టోరీకి అద్దం పడుతోన్న 'ధడక్' .. ట్రైలర్ రిలీజ్

- ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'ధడక్'
- ఆకట్టుకుంటోన్న జాన్వీ నటన
- వచ్చేనెల 20వ తేదీన విడుదల
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ .. ఇషాన్ జంటగా 'ధడక్' చిత్రం రూపొందింది. ధర్మ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ట్రైలర్ ఫస్టాఫ్ లో అందంగా సాగిపోయిన వాళ్ల ప్రేమకథ .. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది చూపించారు.
