shalini pandey: ధనుష్ అంటే ఇష్టం .. కమల్ తో నటించాలని వుంది: షాలినీ పాండే

  • కోలీవుడ్ లోను మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నాను 
  • ధనుష్ నటన చాలా సహజంగా ఉంటుంది 
  • ఆయన డాన్స్ చేసే తీరు బాగా నచ్చుతుంది

షాలినీ పాండేకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాలోని తన పాత్ర ద్వారా ఆమె యూత్ కి బాగా చేరువైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడం వలన, షాలినీ పాండేకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె తనకి నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో షాలినీ పాండే మాట్లాడుతూ .. "తెలుగులో చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది. ఇక తమిళంలో చేస్తోన్న '100% కాదల్' అక్కడ మంచి గుర్తింపును తీసుకొస్తుందని భావిస్తున్నాను. తెలుగుతో పాటు తమిళం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తమిళంలో నేను ధనుష్ నటనను ఎక్కువగా ఇష్టపడతాను. ఆయన నటన .. డాన్స్ ఎంతో సహజంగా ఉంటాయి. ఇక కమల్ పట్ల నాకు గల అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయనతో కలిసి నటించాలని వుంది .. అదే జరిగితే నా అంతటి అదృష్టవంతురాలు లేనట్టే" అని చెప్పుకొచ్చింది.  

shalini pandey
dhanush
  • Loading...

More Telugu News