polavaram: పోలవరం 'డయాఫ్రం వాల్' పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

  • డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంపై చంద్రబాబు హర్షం 
  • శాంతి హోమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • పోలవరం పనుల్లో కష్టపడుతున్న అందరికీ సీఎం అభినందనలు

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్ పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన శాంతి హోమంలో ఆయన పాల్గొన్నారు.

 కాగా, అమరావతిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఈరోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రస్తుతం అందరి దృష్టి రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల పైనే ఉందని, వీటి నిర్మాణంలో కీలకమైన మైలు రాళ్లను అధిగమిస్తున్నామని చెప్పారు.

పోలవరం డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేయడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. 24 గంటల్లో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం సరికొత్త రికార్డు అని, 42 గంటల్లో 19,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్  అధిగమించాలని సూచించారు. ఈ విషయంలో గిన్నిస్ రికార్డును తిరగరాయాలని అన్నారు. పోలవరం పనుల్లో చెమటోడ్చి పని చేస్తున్న అందరికీ తన అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News