red sandal: కడప జిల్లాలో అధికారులపై ఎర్రచందనం కూలీల రాళ్ల దాడి!
- కడప జిల్లా తోట్లవరస అటవీ ప్రాంతంలో కూంబింగ్
- కూలీలను పట్టుకునేందుకు యత్నించిన అధికారులు
- రాళ్ల దాడి చేసి కూలీల పరార్
కడప జిల్లా వేంపల్లి పరిధిలోని తోట్లవరస అటవీ ప్రాంతంలో అటవీ అధికారులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వేంపల్లె-రాయచోటి మధ్య ఉన్న తోట్లవరస అటవీ ప్రాంతంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్న కూలీలను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు యత్నించిన సమయంలో వారిపై కూలీలు రాళ్ల దాడి చేసి పరారయ్యారు. సుమారు 80 మంది కూలీలు ఉన్నారని, వారిని పట్టుకునేందుకు చెక్ పోస్టుల వద్ద అప్రమత్తం చేశామని డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. రూ.2 కోట్ల విలువ చేసే 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని శివప్రసాద్ తెలిపారు. తమిళనాడు కూలీలు కర్ణాటక మీదుగా కడప జిల్లా వస్తున్నారని చెప్పారు.