Mumbai: నడిరోడ్డుపై విదేశీయుడి శృంగారం.. లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన ముంబై పోలీసులు!

  • నడిరోడ్డుపై శృంగారంలో మునిగిపోయిన విదేశీయుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

ముంబైని గత కొన్ని రోజులుగా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ విదేశీయుడు నడిరోడ్డుపై, అది కూడా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుగా శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయాడు. భారత దేశానికే చెందిన యువతితో పబ్లిక్‌గా ముద్దుపెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. అటుగా వెళ్లే వారంతా ఈ దృశ్యాన్ని సినిమా చూస్తున్నట్టు చూశారు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రావడంతో ఇద్దరూ పారిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తుండగా యువతి పట్టుబడింది. యువకుడు రష్యా నుంచి వచ్చినట్టు గుర్తించి అతడి కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువతి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించారు.

ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. యువతిని చెంబూరులోని మహిళా సురక్షా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News