rtc: సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: టీఎంయూ అధ్యక్షుడు

  • ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది
  • సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాలు చెల్లిస్తామన్నారు
  • మధ్యంతర భృతితో పాటు త్వరలోనే ఫిట్‌మెంట్‌ 
  • మిగతా సమస్యలనూ సర్కారు పరిష్కరిస్తుందనుకుంటున్నాం

ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాలు నగదు రూపంలో చెల్లిస్తామన్నారని తెలిపారు. ఇప్పుడు ప్రకటించిన మధ్యంతర భృతితో పాటు త్వరలోనే ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నారని చెప్పారు.

ప్రభుత్వం నుంచి తమకు హామీ వచ్చిందని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మిగతా సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు.         

rtc
tmu
Telangana
  • Loading...

More Telugu News