Pranab Mukherjee: మా నాన్న రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయబోరు: ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ

  • ఇటీవల ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌
  • బీజేపీకి మద్దతిస్తున్నారంటోన్న శివసేన
  • ఆరోపణలను తిప్పికొట్టిన ప్రణబ్‌ కూతురు

తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయబోరని కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ ఓ ట్వీట్‌ ద్వారా తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ పావులు కదుపుతోందని, అందుకే ప్రణబ్‌ ముఖర్జీని తమ కార్యక్రమానికి ఆహ్వానించిందని శివసేన ఆరోపణలు చేస్తోంది. ప్రణబ్‌ చేసిన ప్రసంగం బీజేపీకి ఎన్నికల్లో మద్దతిచ్చేలా ఉందని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ఠ ముఖర్జీ భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనలేదని, ఇకపై కూడా ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.

Pranab Mukherjee
Congress
BJP
  • Loading...

More Telugu News