delhi: రేపు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ నేతలు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలి
- ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉంది
- ఈ మేరకు రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేస్తాం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పును పున:సమీక్షించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలని, ఈ మేరకు రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ చట్టానికి కేంద్రం తూట్లు పొడిచిందని, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని అన్నారు.