petrol: మరికాస్త తగ్గిన పెట్రోల్ ధర... వరుసగా 12వ రోజు ధరల తగ్గింపు
- హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.81.33
- డీజిల్ ధర రూ.74.02
- విశాఖలో రూ.82.35, రూ.74.70
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు కాస్తంత తగ్గుతున్నాయి. వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే పెట్రోల్ లీటర్ పై 24 పైసలు, డీజిల్ పై 18 పైసల చొప్పున తగ్గించింది. పన్నుల భారం తగ్గుదలను కూడా కలిపి చూస్తే వివిధ ప్రాంతాల్లో తగ్గిన ధరల వివరాలు...
హైదరాబాద్ లో డీజిల్ ధర లీటర్ కు 20 పైసలు తగ్గి రూ.74.02 కాగా, పెట్రోల్ ధర లీటర్ కు 26 పైసలు తగ్గి రూ.81.33కు దిగొచ్చింది. వైజాగ్ లో లీటర్ డీజిల్ ధర 31 పైసలు తగ్గి రూ.74.70, పెట్రోల్ ధర 41 పైసలు తగ్గి రూ.82.35 గా ఉన్నాయి. గుంటూరులో డీజిల్ పై 31 పైసలు తగ్గి రూ.75.55గా, పెట్రోల్ లీటర్ పై 41 పైసలు తగ్గి రూ.82.31గా ఉన్నాయి.