Tamannaah: మీడియాలో ఎందుకిలా నా గురించి వక్రీకరించి రాస్తున్నారు?: హీరోయిన్‌ తమన్నా

  • మేము బాధపడతామని కూడా ఆలోచించరు
  • టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు 
  • నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా

తన మాటలను మీడియాలో వక్రీకరించి రాయడం జరుగుతోందని హీరోయిన్ తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పేది ఒకటైతే, మీడియాలో మరొకలా వస్తోందని బాధపడింది. తన అందం, నటన, డ్యాన్స్‌ లతో మంచి పేరు తెచ్చుకున్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీడియాలో వస్తోన్న గాసిప్స్‌పై స్పందించింది. మీడియాలో అలా రాయడం వల్ల తాము బాధపడతామని కూడా ఆలోచించరని చెప్పింది.

తన గురించి వార్తలు రాసేటప్పుడు తనని అడిగి కన్ఫార్మ్‌ చేసుకుని రాయండని తమన్నా సూచించింది. టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి కొందరు హీరోయిన్లపై ఇలా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని వాపోయింది. చివరకు తన పెళ్లి గురించి గాసిప్స్ ఎక్కువయిపోయాయని అంది. తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని వ్యాఖ్యానించింది. 

Tamannaah
Tollywood
marriage
  • Loading...

More Telugu News