Jagan: రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగానే జగన్ రాజమండ్రి చేరుకుంటారు: వైవీ సుబ్బారెడ్డి

  • ఈ నెల 12న జగన్ పాదయాత్రలో ఎలాంటి మార్పు లేదు
  • జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర చేస్తోంది
  • రాజమండ్రిలో పాదయాత్ర చారిత్రక ఘట్టంగా నిలవనుంది

ఈ నెల 12న జగన్ పాదయాత్రలో ఎలాంటి మార్పు లేదని, రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగా ఆయన రాజమండ్రి చేరుకుంటారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బ్రిడ్జి మీదుగా జగన్ ప్రజా సంకల్ప యాత్ర రాజమండ్రి చేరుకుంటుందని చెప్పారు.

జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. జగన్ పాదయాత్రలో ఎక్కడా తొక్కిసలాట జరగలేదని, రాజమండ్రి బ్రిడ్జి వద్ద కూడా ప్రమాదం జరిగే అవకాశం లేదని అన్నారు. అధికార పార్టీ కుట్రలో భాగంగానే జగన్ పాదయాత్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజమండ్రిలో పాదయాత్ర చారిత్రక ఘట్టంగా నిలవనుందని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

Jagan
pada yatra
yv subba reddy
  • Loading...

More Telugu News