bjp: బీజేపీకి మెజారిటీ రాకపోతే పీఎం అభ్యర్థిగా ప్రణబ్ ను ఆర్ఎస్ఎస్ తెరపైకి తేవచ్చు!: శివసేన

  • అందుకు ఆర్ఎస్ఎస్ సన్నద్ధమవుతోందని భావిస్తున్నాం
  • ఏ విధంగా చూసినా బీజేపీ 110 సీట్లను కోల్పోతుంది
  • శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటన

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఓ సంచలన ప్రకటన చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోతే, ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రతిపాదించేందుకు ఆర్ఎస్ఎస్ సన్నద్ధమవుతోందని వ్యాఖ్యానించారు.

‘‘బీజేపీకి తగిన సంఖ్యా బలం రాకపోతే ప్రణబ్ ముఖర్జీని పీఎంగా ప్రతిపాదించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోందని భావిస్తున్నాం. ఏ విధంగా చూసినా బీజేపీ ఈ సారి 110 సీట్ల వరకూ కోల్పోవడం ఖాయం’’ అని సంజయ్ రౌత్ అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ వార్షిక కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరైన నేపథ్యంలో రౌత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చినా గానీ ప్రణబ్ ముఖర్జీ పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో మంది రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరచడం గమనార్హం. భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులరిజమే భారత్ కు తగినదంటూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మెజారిటీ రాకపోతే అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన అందరివాడు ప్రణబ్ ను ఆర్ఎస్ఎస్ తెరపైకి తీసుకురావచ్చంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News