kalyan dev: 'విజేత' ఆడియో ఫంక్షన్ కి చిరూతో పాటు చరణ్ .. బన్నీ!

- కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
- కథానాయికగా మాళవిక నాయర్
- జూలైలో భారీ స్థాయి విడుదల
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో 'విజేత' సినిమా రూపొందింది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించింది. జూలైలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు.
