Pranab Mukherjee: మా పేరు చెడగొట్టేందుకే ప్రణబ్ ఫొటోను మార్ఫింగ్ చేశారు: ఆర్ఎస్ఎస్

  • ఈ పని విభజన రాజకీయ శక్తులు చేసిందే
  • ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం తగదు
  • ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం

నాగపూర్ లో ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షా వర్గ్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కూడా వారిలాగే తన కుడి చేతిని ఎత్తి ఛాతి వరకు ఉంచినట్లు ఓ మార్ఫింగ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ మార్ఫింగ్ వ్యవహారంపై మండిపడుతున్న ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే విభజన రాజకీయ శక్తులు కొన్ని ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాయని, ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. 

Pranab Mukherjee
marphing
Rss
  • Loading...

More Telugu News