India: విశ్వంలో కొత్త గ్రహం.. కనుగొన్న ఇస్రో.. అతి కొన్ని దేశాల సరసన భారత్‌!

  • కె2-236బి అని పేరు పెట్టిన ఇస్రో
  • భూమికన్నా ఆరింతల వ్యాసార్థం  
  • 27 రెట్ల అధిక ద్రవ్యరాశి

విశ్వంలోని ఓ కొత్త గ్రహాన్ని కనుగొని, ఇటువంటి ఘనత సాధించిన అతి కొన్ని దేశాల సరసన మన దేశం నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆ గ్రహాన్ని కనుగొని దానికి కె2-236బి అని పేరుపెట్టింది. ఆ కొత్త గ్రహం భూమికన్నా ఆరింతల వ్యాసార్థం, 27 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగి ఉంది. ఆ గ్రహంలో 60-70% మంచు, సిలికేట్‌, ఇనుము తదితర పదార్థాలు ఉండొచ్చని ఇస్రో పేర్కొంది.

అది భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో, కె2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉందని చెప్పింది. ఆ గ్రహం తన నక్షత్రం చుట్టూ పరిభ్రమించడానికి 19.5 రోజులు పడుతోంది. అది కె2-236 (ఎపిక్‌ 211945201) చుట్టూ తిరుగుతుండడంతో దానికి కె2-236బి అని పేరుపెట్టారు. ఈ పరిశోధనను అహ్మదాబాద్‌లోని ఇస్రో భౌతిక పరిశోధన ప్రయోగశాలకు చెందిన ప్రొ.అభిజిత్‌ చక్రవర్తి టీమ్‌ చేపట్టింది.

  • Loading...

More Telugu News