nithin: అందమైన ఇంటి సెట్ లో 'శ్రీనివాస కల్యాణం'

- షూటింగు దశలో 'శ్రీనివాస కల్యాణం'
- ఈ నెలాఖరుకు టాకీ పార్టు పూర్తి
- ఆగస్టు 9వ తేదీన భారీ విడుదల
దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పండుగ నేపథ్యంలో ఇంటిల్లిపాది కలిసి పాడుకునే పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట ఉంటుందని అంటున్నారు.
