Tirumala: టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి: శ్రీ విద్యాగణేశానంద భారతీ స్వామి

  • ఈ పరిణామాలతో భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు
  • రమణ దీక్షితుల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
  • టీటీడీలో అన్యమతస్థులు ఉన్నారు

టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని శ్రీ విద్యాగణేశానంద భారతీ స్వామి అన్నారు. తిరుపతిలో ఈరోజు జరుగుతున్న పీఠాధిపతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాగణేశానంద భారతీ స్వామి మాట్లాడుతూ, ఈ పరిణామాలతో భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారని, రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

టీటీడీలో అన్యమతస్థులు ఉన్నారని, ఈ విషయమై టీటీడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారికి చెందిన పింక్ వజ్రం పగిలిపోయే ఆస్కారమే లేదని అభిప్రాయపడ్డారు. అర్చకత్వం, సన్నిధి గొల్లల విషయంలో వంశపారంపర్య పరంపర కొనసాగాలని, టీటీడీ బోర్డు సభ్యులకు ఆగమ సంప్రదాయాలు తెలిసి ఉండాలని, ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో అలాంటి వ్యక్తులు లేకపోవడం బాధాకరమని, టీటీడీలో ఇదివరకటి మాదిరిగానే కైంకర్యాలు జరగాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర పీఠాధిపతులు అన్నారు.

  • Loading...

More Telugu News