Champalal Devda: దుర్భాషలాడుతూ.. కానిస్టేబుల్ చెంపలు వాయించిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

  • వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్న బీజేపీ నేతలు
  • మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో మరో ఘటన
  • పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ చెంపలు పగలగొట్టిన ఎమ్మెల్యే దేవ్డా

బీజేపీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడం సాధారణ అంశంగా మారిపోయింది. తాజాగా మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్డా ఓ కానిస్టేబుల్ పై దాడి చేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ, రెండు చెంపలూ వాయించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.

సీసీ కెమెరాలో రికార్డయిన సన్నివేశాల ప్రకారం.... దేవాస్ జిల్లాలోని ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే మేనల్లుడు తొలుత వచ్చాడు. పోలీస్ స్టేషన్ లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లాడు. లాకప్ లో ఉన్న ఓ ఖైదీ నుంచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సంతోష్ ఎమ్మెల్యే మేనల్లుడిని అడ్డుకున్నాడు. పోలీస్ స్టేషన్ లోపలకు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాడు. వెంటనే అక్కడ జరిగిన విషయం గురించి ఎమ్మెల్యేకు మేనల్లుడు సమాచారం అందించాడు. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీలో ఎమ్మెల్యే ఎంటరయ్యాడు. కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ, రెండు చెంపలూ వాయించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని జిల్లా ఎస్పీ అన్షుమన్ సింగ్ తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగిందని చెప్పారు. సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం), సెక్షన్ 332 (ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం) కింద కేసు నమోదయింది.

Champalal Devda
bjp
mla
constable
slap
Madhya Pradesh
dewas
  • Error fetching data: Network response was not ok

More Telugu News