nagashourya: నాగశౌర్య సరసన ఇద్దరు కొత్త కథానాయికలు

- నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
- దర్శకుడిగా శ్రీనివాస చక్రవర్తి
- 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి
'ఛలో' సినిమాతో నాగశౌర్య హీరోగానూ .. నిర్మాతగాను సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమా 'నర్తనశాల'ను కూడా ఆయన సొంత బ్యానర్ పైనే చేస్తున్నాడు. కామెడీతో కూడిన ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ద్వారా కాశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ కథానాయికలుగా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు.
