trivikram: ఒకే ఒక్క సెల్ఫీతో పుకార్లకు తెరదించిన త్రివిక్రమ్!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ'
  • ఎన్టీఆర్ కాంబినేషన్లోని సీన్స్ చిత్రీకరణ 
  • కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి

కొంతమంది వ్యక్తుల కారణంగా ఎన్టీఆర్ కి .. తనకి మధ్య దూరం పెరిగిందని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ శ్రీనివాస రెడ్డి చెప్పాడు. అవకాశం చిక్కినప్పుడు ఎన్టీఆర్ తో మాట్లాడి అపోహలను చెరిపేస్తానని అన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ'ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి చేస్తున్నాడు.

 ఎన్టీఆర్ .. శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నాడట. అయితే శ్రీనివాసరెడ్డితో ఎన్టీఆర్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడనీ .. ఆయన ధోరణికి శ్రీనివాసరెడ్డి చాలా బాధపడుతున్నాడనే టాక్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం త్రివిక్రమ్ ను ఇబ్బంది పెడుతోందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో త్రివిక్రమ్ రంగంలోకి దిగాడు. ఎన్టీఆర్ .. శ్రీనివాసరెడ్డి ఎంతో సన్నిహితంగా 'అరవింద సమేత వీర రాఘవ' సెట్లో తీసుకున్న ఓ సెల్ఫీని త్రివిక్రమ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇందులో త్రివిక్రమ్ కూడా వున్నాడు.            

  • Loading...

More Telugu News