boy: విజయవాడలో దారుణం.. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల వివాహిత మహిళ లైంగిక దాడి.. అరెస్ట్!

  • విజయవాడలో చోటుచేసుకున్న ఘటన
  • ఇంట్లోకి పిలిచి అత్యాచారయత్నం
  • మహిళకు 15 రోజుల రిమాండ్

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, విజయవాడలో సీన్ రివర్స్ అయింది. 14 ఏళ్ల బాలుడిపై 40 ఏళ్ల ఓ వివాహిత లైంగిక దాడికి యత్నించింది. తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. నగరంలోని నున్నలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. కంగారు పడిపోయిన బాధిత బాలుడు ఇంటికెళ్లి అతని అమ్మతో జరిగిన విషయం గురించి చెప్పాడు.

దీంతో, ఆమె వచ్చి వివాహితపై చేయి కూడా చేసుకున్నారు. అనంతరం నున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫోక్సా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. వైద్య పరీక్షల కోసం బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన ప్రస్తుతం విజయవాడలో చర్చనీయాంశంగా మారింది.

boy
woman
tape
vijayawada
nunna
  • Loading...

More Telugu News