Ramcharan: చందానగర్ లో సందడి చేసిన రాంచరణ్.. అభిమానుల కోలాహలం!

  • చందానగర్ లో మొబైల్ షోరూంను ప్రారంభించిన చరణ్
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
  • ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డ యువతీయువకులు

హైదరాబాదు శివారు చందానగర్ లో టాలీవుడ్ హీరో రాంచరణ్ నిన్న సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ మొబైల్ స్టోర్ ను చరణ్ ప్రారంభించాడు. చరణ్ వస్తున్నాడనే వార్తతో షోరూం వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. యువతీయువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చరణ్ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తొక్కిసలాట ఎక్కువ కావడంతో, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ, హ్యాపీ మొబైల్ సంస్థ నగరంలో ఒకే రోజు 20 షోరూంలను ప్రారంభించడం అభినందనీయమని చెప్పాడు. రూ. 500 కోట్ల వ్యాపారం చేయాలనే లక్ష్యంతో, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలనే ఆకాంక్షతో వచ్చిందని తెలిపాడు.

Ramcharan
tollywood
chanda nagar
  • Loading...

More Telugu News