KCR: ఆర్టీసీ కార్మికులను కేసీఆర్‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: వీహెచ్

  • ఓ వైపు అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు
  • మరోవైపు న్యాయంగా రావాల్సిన వేతనాలకు నో
  • ఓట్ల కోసమే కుల సంఘాలకు నిధులు

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ... ఓ వైపు అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు, 5 ఎకరాలు కేటాయిస్తోన్న కేసీఆర్... మరోవైపు న్యాయంగా రావాల్సిన వేతనాలు ఇవ్వాలని కోరుతోన్న ఆర్టీసీ ఉద్యోగులను మాత్రం భయపెడుతున్నారని విమర్శించారు. ఓట్ల కోసమే కుల సంఘాలకు నిధులు కేటాయించారని అన్నారు.

ఇప్పటికయినా ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను మానుకోవాలని వీహెచ్‌ హితవు పలికారు. కాగా, కొన్ని రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై తాము చర్చిస్తున్నామని,  అలాగే, 2019 ఎన్నికల్లో 'కలసి ఉంటే కలదు సుఖం' అనే నినాదంతో ముందుకు వెళతామని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News