Pranab Mukherjee: ప్రణబ్ ప్రసంగం అద్భుతమంటూ అద్వానీ ప్రశంసలు

  • ప్రణబ్ ప్రసంగం భారత ఆధునిక చరిత్రలో నిలిచిపోతుంది
  • సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గొప్ప రాజనీతజ్ఞుడు ప్రణబ్
  • మోహన్ భగవత్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి

నిన్న నాగపూర్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలే కాకుండా, బీజేపీ నేతలూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రణబ్ చేసిన ప్రసంగం భారత ఆధునిక చరిత్రలో నిలిచిపోతుందని, ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి ప్రణబ్ ను ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను, ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చిన ప్రణబ్ ను అద్వానీ కొనియాడారు. భారత్ జాతీయత, ఆదర్శాల గురించి ప్రణబ్ అద్భుతంగా మాట్లాడారని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన గొప్ప రాజనీతజ్ఞుడని అన్నారు. ప్రణబ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని అద్వానీ ఆనందం వ్యక్తం చేశారు.

Pranab Mukherjee
advani
  • Loading...

More Telugu News