Tirumala: రేపు తిరుపతిలో స్వామీజీలతో సమావేశం నిర్వహిస్తున్నాం: పరిపూర్ణానందస్వామి

  • తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని సందర్శించుకున్న శ్రీపీఠం పీఠాధిపతి
  • టీటీడీ వ్యవహారంపై సాధువులు విస్మయం చెందుతున్నారు
  • భక్తుల్లో కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది

తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద ఈరోజు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం, మరమ్మతులు నిర్వహించిన వకుళామాత పోటును టీటీడీ అధికారులు ఆయనకు చూపించారు.

అదేవిధంగా సంపంగి ప్రాకారంలో ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని చూపించి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. 2001, 2007లో పోటు మరమ్మతుల కారణంగా ఇక్కడే ప్రసాదాలు తయారు చేశామని సంబంధిత సిబ్బంది పరిపూర్ణానందకు తెలిపారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాన్ని కూడా టీటీడీ అధికారులు ఆయనకు చూపించారు.

ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ వ్యవహారంపై యావత్తు దేశంలోని సాధువులు విస్మయం చెందుతున్నారని, అలాగే, భక్తుల్లో కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొందని అన్నారు. రేపు తిరుపతిలో జరగబోయే సమావేశంలో స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారని, ఈ సమావేశంలో ఈ వ్యవహారంపై, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు.   

  • Loading...

More Telugu News