Jeevan Reddy: ఆర్టీసీ కార్మికులని బెదిరించడం సరికాదు: టీపీసీసీ
- తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలకంగా వ్యవహరించింది
- కార్మికులు న్యాయమైన కోరికలే అడిగారు
- లాభాల్లో ఉన్న ఆర్టీసీని కేసీఆరే నష్టాల బాట పట్టించారు
- ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను విడుదల చేయాలి
ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో, యూనియన్ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ నేతలు విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీని బెదిరించడం సరికాదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. వారు న్యాయమైన కోరికలే అడిగారని, లాభాల్లో ఉన్న ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆరే నష్టాల బాట పట్టించారని అన్నారు. ఆ సంస్థ నష్టాలకు ఆర్టీసీ ఛైర్మన్, మంత్రి మహేందర్‌రెడ్డి బాధ్యులని అన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను తెలంగాణ సర్కారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.