radhika: అమ్మమ్మగా ప్రమోషన్ పొందిన సినీ నటి రాధిక!

  • కుమారుడికి జన్మనిచ్చిన రాధిక కుమార్తె రెయాన
  • క్రికెటర్ అభిమన్యు మిథున్ తో రెయాన వివాహం
  • రాధిక, రిచర్డ్ హార్డీల కుమార్తె రెయాన

ప్రముఖ సినీ నటి రాధిక అమ్మమ్మగా ప్రమోషన్ పొందారు. ఆమె కుమార్తె రెయాన పండంటి కుమారుడికి జన్మనిచ్చారు. క్రికెటర్ అభిమన్యు మిథున్ తో రెయానకు 2016 ఆగస్ట్ లో వివాహం జరిగింది. రాధిక, ఆమె రెండో భర్త రిచర్డ్ హార్డీల కుమార్తె రెయాన. 1992లో రిచర్డ్ కు రాధిక విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2001లో నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు. తనకు మనవడు పుట్టిన విషయాన్ని రాధిక తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఎంతో సంతోషంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. 'ఇట్స్ ఏ బోయ్' అంటూ ఓ గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేశారు. 

radhika
rayane
grand mother
grand son
  • Error fetching data: Network response was not ok

More Telugu News