Narendra Modi: 'మోదీ హత్యకు కుట్ర' అవాస్తవం... గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే డ్రామాలాడారు: కాంగ్రెస్‌

  • ఇది మోదీ రాజకీయవ్యూహం 
  • ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళన ఆయనలో ఉంది
  • ఇటువంటి పిట్టకథలతో ప్రజలను మభ్య పెట్టలేరు
  • దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిగిందని మహారాష్ట్రలోని పూణె పోలీసులు సంచలన విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీని హత్య చేసిన తరహాలోనే గతేడాది మావోయిస్టులు ఈ కుట్ర పన్నారని సెషన్స్ కోర్టుకు పోలీసులు తెలియజేశారు. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళన కారణంగానే స్వయంగా నరేంద్ర మోదీయే ఈ కొత్త నాటకానికి తెరదీశారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటువంటి పిట్టకథలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టలేరని పేర్కొంది.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌ మాట్లాడుతూ... మోదీ ప్రాణానికి ముప్పు ఉందని వస్తోన్న రిపోర్టులు పూర్తిగా అసత్యమని తాము అనడం లేదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. అలాగే, మోదీకి ఇలాంటి నాటకాలు ఆడడం కొత్తకాదని, ఆయన గుజరాత్‌కు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలానే రాజకీయవ్యూహాలు వేశారని చెప్పారు.

Narendra Modi
Gujarath
Congress
  • Loading...

More Telugu News