naidupeta: మోదీకి ఎదురు నిలిచి పోరాడే ధైర్యం చంద్రబాబుకే ఉంది: మంత్రి సోమిరెడ్డి

  • బీజేపీని విమర్శిస్తే జైలు కెళ్తానని జగన్ భయం
  • కర్ణాటక ఎన్నికలతో బీజేపీ పతనం ప్రారంభం
  • నాయుడుపేటలో మహాసంకల్ప దీక్షలో పాల్గొన్న సోమిరెడ్డి

మోదీకి ఎదురు నిలిచి పోరాడే ధైర్యం చంద్రబాబుకే ఉందని ఏపీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరు జల్లా నాయుడుపేటలో మహాసంకల్ప దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బీజేపీని విమర్శిస్తే జైలు కెళ్తానని జగన్ భయపడుతున్నారని, కర్ణాటక ఎన్నికలతో బీజేపీ పతనం ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఆర్థికలోటు ఉన్నా ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఆయనకు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి మోదీ మొండి వైఖరే కారణమని, హోదా ఇవ్వని బీజేపీని జగన్, పవన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

naidupeta
somireddy
  • Loading...

More Telugu News