krishna rever: కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ.. ఉత్తర్వులు జారీ

  • ప్రకాశం బ్యారేజీకి పైన 23 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం
  • రాజధానికి నీటి సరఫరా కోసం బ్యారేజ్
  • సామర్థ్యం 10 టీఎంసీలు

రాజధాని ప్రాంతంలో కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం జరగబోతోంది. నిర్మాణానికి సంబంధించి రూ. 2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి పైన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం వద్ద ఈ బ్యారేజీని నిర్మించబోతున్నారు. 10 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. నూతన రాజధాని అమరావతికి నీటి సరఫరా కోసం ఈ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు.

krishna rever
amaravathi
barrage
  • Loading...

More Telugu News